Andhra Pradesh: జోరు పెంచిన ఎన్నికల సంఘం.. నేడు విజయవాడలో కౌంటింగ్ పై శిక్షణా కార్యక్రమం!

  • హాజరుకానున్న లోక్ సభ, అసెంబ్లీ ఆర్వోలు
  • ఉదయం పదిన్నర నుంచి 11.30 గంటల వరకూ శిక్షణ
  • హాజరు కానున్న ద్వివేది, సుజాత శర్మ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమయింది. ఈరోజు విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) పాల్గొంటారు.

వీరితో పాటు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ కూడా పాల్గొంటారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఆర్వోలకు కౌంటింగ్ పై శిక్షణ ఇస్తామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఆ తర్వాత 11.30 నుంచి 12 గంటల వరకూ ఈటీపీబీఎస్ పై శిక్షణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సమావేశ ప్రాంగణంలో మోడల్ కౌంటింగ్ కేంద్రం సందర్శన ఉంటుందని వ్యాఖ్యానించారు.

More Telugu News