Devineni Uma: ఇక చాలు దయచేయమని జగన్‌కు కేసీఆర్ చెప్పేశారు: దేవినేని

  • ఈ నెల 23 తర్వాత వైసీపీ దుకాణం బంద్
  • లోటస్ పాండ్ నుంచి ఏపీలోకి అరాచక శక్తులు
  • నిఘా వర్గాలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

ఈ నెల 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ కాబోతోందని టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఈ ఉదయం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్‌లోని వైసీపీ దుకాణాన్ని కూడా మూసేయమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి జగన్‌కు ఆదేశాలు వెళ్లాయన్నారు. ఇప్పటి వరకు నీ పాపాలు మోసానని, ఇక తన వల్ల కాదని జగన్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని ఉమ అన్నారు.

ఎన్నికల ఖర్చుల కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశానని, మునిగిపోయే పడవలాంటి నిన్ను పట్టుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా లేనని జగన్‌తో కేసీఆర్ తేల్చి చెప్పారని ఉమ ఎద్దేవా చేశారు. కేంద్రంలో రేపొద్దున ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి తనకు చిక్కులు ఉండకూడదంటే తెలంగాణలో జగన్ తన దుకాణాన్ని మూసేసుకోవాల్సిందేనంటూ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నుంచి జగన్‌కు ఆదేశాలు వెళ్లాయని ఉమ అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో జగన్ తన దుకాణాన్ని ఏపీకి మారుస్తున్నారని, అరాచక శక్తులు ఏపీలో అడుగుపెడుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు, నిఘా వర్గాలు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని ఉమ కోరారు.

More Telugu News