keerthi suresh: కీర్తి సురేశ్ కొత్త చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీర్తి సురేశ్ 
  • యూరప్ లో జరుగుతోన్న షూటింగ్
  •  'సఖి' టైటిల్ ఖరారు చేసే ఛాన్స్    

'మహానటి' సినిమా ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత కూడా తమిళంలో ఆమె స్టార్ హీరోల జోడీగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. కానీ తెలుగులో మాత్రం ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు యూరప్ లో జరుగుతోంది.

ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నరేంద్ర అనే యువకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

More Telugu News