Narendra Modi: అదే స్థానంలో ఈశ్వర చంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: మోదీ

  • విగ్రహాన్ని పంచలోహాలతో తయారుచేయిస్తాం
  • ఈశ్వర చంద్ర సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం
  • అమిత్ షా రోడ్ షోలో దాడులు చేసింది తృణమూల్ కార్యకర్తలే

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రముఖ సంఘ సంస్కర్త, బెంగాలీ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే, పంచలోహాలతో ఈశ్వర చంద్ర విగ్రహాన్ని తయారుచేయించి కూల్చిన స్థానంలోనే తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈశ్వర చంద్ర సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పి మోదీ, ఆయన విగ్రహాన్ని కూల్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ లో హింస రాజ్యమేలుతోందని విమర్శించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షోలో దాడికి పాల్పడింది తృణమూల్ కార్యకర్తలేనని మోదీ ఆరోపించారు. కాగా, దీనిపై మమత వర్గీయులు వెంటనే స్పందించారు. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ, మోదీని అబద్ధాల కోరుగా అభివర్ణించారు. తాజాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దీనిపై వ్యాఖ్యానించారు. విగ్రహాలు ధ్వంసం చేయడం బీజేపీకి కొత్తకాదని చురక వేశారు.

More Telugu News