sidhu: రాహుల్ ఒక ఫిరంగి.. నేను ఏకే47: సిద్ధూ

  • 2014లో గంగామాత పుత్రుడినని చెప్పుకుని మోదీ వచ్చారు
  • ఈ ఎన్నికల్లో రాఫెల్ ఏజెంట్ గా వెళ్లిపోతారు
  • అవినీతిపై మోదీతో చర్చకు నేను సిద్ధం

ప్రధాని మోదీపై పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో గంగామాత పుత్రుడినని చెప్పుకొని మోదీ వచ్చారని... ఈ ఎన్నికల్లో రాఫెల్ ఏజెంట్ అనే ముద్ర వేసుకుని వెళ్లిపోతారని అన్నారు. రాఫెల్ డీల్ లో బ్రోకరేజ్ సొమ్ము తీసుకున్నారో, లేదో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మోదీతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మోదీతో చర్చకు రాహుల్ గాంధీ అవసరంలేదని తెలిపారు. రాహుల్ ఫిరంగి అయితే... తాను ఏకే47 అని చెప్పారు.

స్వయంగా అవినీతికి పాల్పడ్డారా? లేక మరెవరైనా అవినీతికి పాల్పడటానికి సహకరించారా? అనే విషయంపై మోదీ తనతో చర్చకు రావాలని సిద్ధూ సవాల్ విసిరారు. ఈ చర్చలో తాను ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని చెప్పారు.

More Telugu News