Drunk Driving: మారని ప్రైవేట్ బస్ డ్రైవర్లు... నేడు కూడా మద్యం తనిఖీల్లో పట్టుబడ్డ వైనం!

  • తాజాగా పట్టుబడ్డ వరుణ్ ట్రావెల్స్ డ్రైవర్
  • గుంటూరు నుంచి విశాఖకు వెళుతున్న బస్సు 
  • కఠిన చర్యలేనంటున్న పోలీసులు

మద్యం తాగి వాహనాలు నడపవద్దని, అందులోనూ బస్సులను నడిపే డ్రైవర్లు మందు కొట్టి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఎంతగా హెచ్చరించినా, పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిన్న పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు మందు కొట్టి, బస్సులను నడిపి, విజయవాడ సమీపంలోని కంచికచర్ల వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పిన గంటల వ్యవధిలోనే, కృష్ణా జిల్లాలోనే గత రాత్రి జరిపిన తనిఖీల్లో మరికొందరు డ్రైవర్లు పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, వరుణ్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మందు కొట్టి బస్సును నడుపుతూ దొరికిపోయాడు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, గుంటూరు నుంచి విశాఖకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న డ్రైవర్ దొరికిపోయాడు. అతని లైసెన్స్ ను, బస్సు పర్మిట్ నూ రద్దు చేయాలని సిఫార్సు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News