Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలకృష్ణ సినిమాలో పాయల్ 
  • రాజమౌళి చిత్రం తాజా షెడ్యూల్ 
  • శర్వానంద్ సినిమా అప్ డేట్ 

*  బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగును ఈ వారంలోనే హైదరాబాదులో ప్రారంభిస్తారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా, ఒక నాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. దీనికి 'రూలర్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.  
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 21 నుంచి జరుగుతుంది. హైదరాబాదు శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగే షూటింగులో ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ తదితరులు పాల్గొంటారు.
*  శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేస్తారు. ఇందులో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News