CPM: బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసే శక్తి తెలుగు రాష్ట్రాలకు ఉంది: 'సీపీఎం' రాఘవులు

  • విపక్షాలు ఏకమవ్వాలి
  • ఎన్డీయేపై దేశంలో వ్యతిరేకత ఉంది
  • ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పలేం

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తాజా రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, తాము ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలో దిగామని, అయితే ఎన్ని సీట్లు గెలుస్తామన్న విషయం చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలు భారత రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాలకు బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చేసే శక్తి ఉందని అన్నారు.

చంద్రబాబు, కేసీఆర్, జగన్ లు బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణాయకశక్తిగా వ్యవహరిస్తారా? లేదా? అనేది వేచి చూడాలని పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే లౌకికవాద రాజకీయ పక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్న రాఘవులు, ఎన్డీయే ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.

More Telugu News