Teenezer: ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ నిర్వహించి.. ఆ ఫలితం ఆధారంగా బాలిక ఆత్మహత్య

  • డి, ఎల్‌ లలో ఏది ఎంచుకోవాలో చెప్పమన్నా బాలిక 
  • డి అంటే డై, ఎల్ అంటే లివ్
  • డి ఆప్షన్‌కు ఓటేసిన 69 శాతం మంది

తాను నిర్వహించిన పోల్ కు వచ్చిన ఫలితం ఆధారంగా ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడింది. మలేషియాలో 16 ఏళ్ల బాలిక తాను బతకడానికి అర్హురాలినా? కాదా? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘డి, ఎల్‌’ లలో ఏదో ఒకటి ఎంచుకొనేందుకు నాకు సహకరించండి’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో 'డి' అంటే డై అని, 'ఎల్' అంటే లివ్ అనే అర్థాలు వస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ పోస్టును చూసిన వారిలో 69 శాతం మంది ‘డి’ ఆప్షన్‌కు ఓటు వేయగా, మిగిలిన 31 శాతం మంది ఎల్ ఆప్షన్‌కు ఓటు వేశారు. దీనిని చూసిన సదరు బాలిక తాను బతికడానికి అర్హురాలిని కాను అని భావించి, భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బాలికతో పాటు ఆమె స్నేహితుల సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.

More Telugu News