Rahul Gandhi: మోదీ ఈ ఐదేళ్ల పాలన తర్వాత మన్మోహన్ ను ఎద్దేవా చేయడం మానుకున్నారు: రాహుల్

  • దేశాన్ని పాలించడానికి ఒక్క వ్యక్తి చాలనుకుంటున్నారు
  • దేశాన్ని పాలిస్తోంది ప్రజలు
  • ఇప్పుడు మోదీని చూసి అందరూ నవ్వుతున్నారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం ఒక్క వ్యక్తితో దేశ పరిపాలన సాధ్యమని మోదీ భావిస్తున్నారని, కానీ వాస్తవానికి ప్రజలే దేశాన్ని పాలిస్తున్నారని రాహుల్ అన్నారు. గతంలో మోదీ తరచుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను లక్ష్యంగా చేసుకుని ఎద్దేవా చేస్తుండేవారని, ప్రస్తుతం మోదీని చూసి అందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఈ ఐదేళ్ల పాలన తర్వాత మన్మోహన్ ను మోదీ ఎద్దేవా చేయడం మానుకున్నారని వ్యాఖ్యానించారు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రాఫెల్ ఒప్పందంపైనా ఆయన స్పందించారు. అవినీతిపై చర్చకు రావాలంటూ ప్రధానికి సవాల్ విసిరారు. ఇక జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించిన రాహుల్, జీఎస్టీ, నోట్లరద్దు నిర్ణయాలు దేశ ఆర్థికస్థితిని నాశనం చేశాయని మండిపడ్డారు.

More Telugu News