sensex: బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి.. చివరి గంటలో కుప్పకూలిన మార్కెట్లు

  • 203 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 65 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 8 శాతం పైగా పతనమైన యస్ బ్యాంక్, టాటా మోటార్స్

ఉదయం నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వచ్చిన దేశీయ మార్కెట్లు చివరి గంటలో కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో లాభాలు ఆవిరైపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు కోల్పోయి 37,114కు పడిపోయింది. నిఫ్టీ 65 పాయింట్లు పతనమై 11,157కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.11%), ఐటీసీ (1.05%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.68%), ఇన్ఫోసిస్ (0.37%), టీసీఎస్ (0.01%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-8.01%), టాటా మోటార్స్ (-8.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.66%), కోల్ ఇండియా (-2.75%), సన్ ఫార్మా (-2.67%).

More Telugu News