Facial Recognition: ప్రపంచంలో తొలిసారి... ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ను నిషేధించిన శాన్ ఫ్రాన్సిస్కో!

  • సంచలన నిర్ణయం తీసుకున్న యూఎస్ నగరం
  • అమాయకుల అరెస్ట్ లు పెరిగిపోతాయన్న నిపుణులు
  • నిషేధం వైపే మొగ్గు చూపిన సిటీ

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం తీసుకువచ్చిన మార్పుల్లో ఒకటైన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ నేరాలను అరికట్టేందుకు ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్న సమయంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. సిటీ ఏజన్సీలు, పోలీసులు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ను వినియోగించడాన్ని నిషేధించింది. ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ వినియోగంపై సిటీ బోర్డు సూపర్ వైజర్లు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

ఏదైనా ఓ వీడియో క్లిప్ లేదా ఫోటోగ్రాఫ్ ను చూపితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అతని ఆనవాలును గుర్తించేదే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్. ఈ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని, అమాయకుల అరెస్ట్ లు పెరిగిపోతాయని ఈ సమావేశంలో పాల్గొన్న అత్యధికులు అభిప్రాయపడటంతో ఈ సాఫ్ట్ వేర్ ను నిషేధించిన తొలి నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో అవతరించింది.

More Telugu News