BJP: అతిపెద్ద పార్టీగా అవతరించేది బీజేపీయేనట.. కానీ 150 సీట్లు దాటవట: మమత జోస్యం

  • కేంద్రంలో ఏర్పడేది బీజేపీ యేతర ప్రభుత్వమే
  • బీజేపీ మమల్ని దారుణంగా అవమానించింది
  • ప్రధాని ఎవరో తేలేది ఫలితాల తర్వాతే

ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే 150 సీట్లకు మించి రావని తేల్చేశారు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమత మాట్లాడుతూ.. మే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడేది బీజేపీయేతర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీకి ఈసారి సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నారు. కేంద్రంలో ఏర్పడే బీజేపీయేతర ప్రభుత్వ ప్రధాని ఎవరనేది ఫలితాల తర్వాతే తేలుతుందన్నారు.

బీజేపీ తమను అత్యంత దారుణంగా అవమానించిందని, ఆ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బెంగాల్‌లోని 42 సీట్లూ తమకే వస్తాయన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను మమత ఎద్దేవా చేశారు.

More Telugu News