Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చైతూకి జోడీగా కాజల్ అగర్వాల్ 
  • మళ్లీ హీరోగా వస్తున్న అలీ 
  • రజనీ 'దర్బార్' అప్ డేట్ 
  • సందీప్ సరసన తాన్యా హోప్

*  నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది.
*  ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండుగాడి ఫొటో స్టూడియో'. దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
*  రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దర్బార్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో అక్కడి షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది.
*  ప్రస్తుతం 'నిను వీడని నీడను నేనే', 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' చిత్రాలలో నటిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. తమిళంలో వచ్చిన 'ఇంద్రు నేత్రు నాలై'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో సందీప్ సరసన తాన్యా హోప్ కథానాయికగా నటిస్తుంది.   

More Telugu News