Andhra Pradesh: విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

  • కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి
  • విదర్భ పరిసరాల్లో ఆవర్తనం
  • రాయలసీమలో కొనసాగుతున్న భానుడి ప్రతాపం

విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో ఆవర్తనం, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నాయి. అలాగే, సముద్రం నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. అలాగే, నేడు విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు, తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. అలాగే, ఏపీలోని నెల్లూరులో మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేడు కూడా కోస్తాలోని కొన్ని ప్రాంతాలతో పాటు, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఇలానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News