balakrishna: బాలకృష్ణ తదుపరి చిత్రం టైటిల్ గా 'రూలర్'?

  • కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
  •  ద్విపాత్రాభినయమంటూ ప్రచారం
  •  ఈ నెల 17వ తేదీన లాంచ్        

బాలకృష్ణ తదుపరి సినిమాపైనే ఆయన అభిమానులంతా దృష్టిపెట్టారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో .. సి.కల్యాణ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను ఖరారు చేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలో కవల సోదరులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఒక కథానాయికగా 'హరిప్రియ' పేరు వినిపిస్తోంది. ఇక ప్రతినాయకుడిగా జగపతిబాబును తీసుకున్నారు. 'లెజెండ్' తరువాత బాలకృష్ణ - జగపతిబాబు కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో భారీ అంచనాలే వున్నాయి.

More Telugu News