Andhra Pradesh: పిల్లలకు అనుక్షణం అండగా నిలిచిన టీచర్లు, తల్లిదండ్రులకు నా అభినందనలు!: నారా లోకేశ్

  • ఏపీలో పదో తరగతి ఫలితాల ప్రకటన
  • విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మంత్రి
  • మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పదో తరగతి ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 94.88% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, పిల్లలకు అండగా నిలిచి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈరోజు విడుదలైన ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 94.88% ఉత్తీర్ణత సాధించిన క్రమంలో, విద్యార్థులకు అనుక్షణం అండగా నిలిచి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. 

More Telugu News