karthikeya: యూత్ ను ఆకట్టుకునేలా 'హిప్పీ' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • టీఎన్ కృష్ణ దర్శకత్వం 
  • కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల   

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరోగా కార్తికేయ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'హిప్పీ' నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళంలోను రూపొందిన ఈ సినిమాకి కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తుండగా, 'టీఎన్ కృష్ణ  దర్శకుడిగా వున్నాడు. దిగాంగన కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

 "ఎవతివే .. ఎవతివే .. ఎదను పట్టి వదలవే. ఎవతివే .. ఎవతివే .. కళ్లలోంచి కదలవే .. " అంటూ ఈ పాట సాగుతోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నివాస్ కె. ప్రసన్న సంగీతం .. కార్తీక్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జేడీ చక్రవర్తి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News