VV Vinayak: ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్... హీరోగా అవతారం ఎత్తనున్న దర్శకుడు వీవీ వినాయక్!

  • గతంలో 'ఠాగూర్'లో నటించిన వినాయక్
  • దిల్ రాజు నిర్మాతగా హీరోగా పరిచయం కానున్న దర్శకుడు
  • దర్శకత్వం వహించనున్న నరసింహారావు

ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా అవతారం ఎత్తనున్నారు. అభిమానులకు ఎంతో సర్ ప్రయిజ్ కలిగించిన ఈ వార్త త్వరలోనే నిజం కాబోతోంది. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన 'ఠాగూర్'లో ఓ గుర్తుండిపోయే పాత్రను ధరించిన వినాయక్, ఇప్పుడు సోలో హీరోగా పరిచయం కాబోతుండగా, దీన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటం గమనార్హం.

 'శరభ' ఫేమ్, గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.  మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఇంటెలిజెంట్‌' తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News