balakrishna: బాలకృష్ణను ఎదుర్కునే విలన్ జగపతిబాబు ఒక్కరేనట!

  • కె.ఎస్.రవికుమార్ తో బాలకృష్ణ
  • ఈ నెల 17న పూజా కార్యక్రమాలు
  •  వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగు      

బాలకృష్ణ కథానాయకుడిగా 'కె.ఎస్.రవికుమార్ ఒక భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా 'హరిప్రియ' ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గా కనిపించే ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటించనున్నాడనే టాక్ వచ్చింది. లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నిర్మాత కల్యాణ్ స్పందిస్తూ, ఈ సినిమాలో విలన్ జగపతిబాబు మాత్రమేననీ .. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలేదని స్పష్టం చేశాడు. దాంతో కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరపడినట్టైంది. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చుతోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News