jet airways: జెట్ ఎయిర్ వేస్ కు మరో షాక్... రాజీనామా చేసిన అమిత్ అగర్వాల్

  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్
  • తాత్కాలికంగా నిలిచిపోయిన సేవలు
  • జెట్ ఎయిర్ వేస్ ఆస్తిని అమ్మకానికి పెట్టిన హెచ్డీఎఫ్సీ

జెట్ ఎయిర్ వేస్ సీఎఫ్ఓ, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేసినట్టు సంస్థ ప్రకటించింది. దాదాపు రూ. 8,500 కోట్ల అప్పుల్లో జెట్ ఎయిర్ వేస్ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా తన కార్యకలాపాలను జెట్ ఎయిర్ వేస్ ఆపేసింది.

మరోవైపు, రూ. 245 కోట్ల విలువ చేసే జెట్ ఎయిర్ వేస్ ఆస్తిని హెచ్డీఎఫ్సీ అమ్మకానికి పెట్టింది. హెచ్డీఎఫ్సీకి జెట్ ఎయిర్ వేస్ రూ. 414.80 కోట్ల అప్పు బకాయి ఉంది. ఈ సంస్థకు సుమారు 120 విమానాలు ఉన్నాయి. అప్పుల భారం పెరిగిపోవడంతో... సిబ్బందికి జీతాలను కూడా చెల్లించలేని స్థితిలోకి ఈ సంస్థ జారుకుంది.

More Telugu News