Kamal Haasan: కమలహాసన్ సరిగ్గానే మాట్లాడారు.... మద్దతుగా నిలిచిన తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ అళగిరి

  • ఆయన వ్యాఖ్యలతో 1000 శాతం ఏకీభవిస్తా
  • ఆర్ఎస్ఎస్ ఓ ఉగ్రవాద సంస్థను తలపిస్తోంది
  • అరబ్ దేశాల్లో ఐఎస్ఐఎస్... ఇక్కడ ఆర్ఎస్ఎస్

లోక్ సభ ఎన్నికల సందర్భంగా నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు అని పేర్కొన్న కమల్, జాతిపిత గాంధీని చంపిన నాథూరాం గాడ్సే పేరు ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల పట్ల ముఖ్యంగా బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కూడా కమల్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే, కమల్ కు సొంతరాష్ట్రం నుంచి మద్దతు లభించింది.

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ కేఎస్ అళగిరి మాట్లాడుతూ కమల్ వ్యాఖ్యలతో తాను నూటికి నూరు శాతం కాదు 1000 శాతం ఏకీభవిస్తున్నానని, కమల్ అన్నదాంట్లో తప్పేమీలేదని అన్నారు. అరబ్ దేశాల్లో ఐఎస్ఐఎస్ సంస్థ తమ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారిని అంతమొందించాలని భావిస్తుందని, భారత్ లో కూడా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, హిందూ మహాసభలు ఆ విధంగానే తయారయ్యాయని అళగిరి విమర్శించారు. తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని విపరీతంగా ద్వేషిస్తూ ఆర్ఎస్ఎస్ ఓ ఉగ్రవాద సంస్థను తలపిస్తోందని అభిప్రాయపడ్డారు.

More Telugu News