Andhra Pradesh: ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు... టీవీలో కూడా చూసుకోవచ్చు!

  • రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు
  • ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో టీవీల్లో ఫలితాలు
  • నంబర్ టైప్ చేయగానే కనిపిస్తాయన్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుండగా, ఈ ఫలితాలను ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లల్లో టీవీపై చూసుకునేలా వినూత్న ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వెల్లడించింది. ఆర్టీజీఎస్ వెబ్‌ సైట్‌ తో పాటు, పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌ లలోనూ ఫలితాలను చూసుకోవచ్చని అన్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లల్లోని టీవీలపై విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ను టైప్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు.
వీటితో పాటు...
www.rtgs.ap.gov.in
https://bit.ly/2E1cdN7
https://aka.ms/apresult
వెబ్ సైట్ల ద్వారానూ రిజల్ట్స్ చూసుకోవచ్చు.

More Telugu News