Mahesh Babu: వంశీ బుగ్గపై ముద్దిచ్చిన మహేశ్... వైరల్ అవుతున్న చిత్రం!

  • సూపర్ హిట్ అయిన 'మహర్షి'
  • వంశీకి ముద్దును బహుమతిగా ఇచ్చిన మహేశ్
  • ఇంతకన్నా ఇంకేం కావాలన్న వంశీ

అందరూ ఊహించినట్టుగానే మహేశ్ బాబు తాజా చిత్రం 'మహర్షి' సూపర్ హిట్ కావడంతో సంబరాలు చేసుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్, తనకు ఇంతటి హిట్ ను ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి "ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను" అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇక ఈ సినిమాలో చూపిన 'వీకెండ్‌ వ్యవసాయం' కాన్సెప్ట్‌ ఎంతో మందిని ఆ దిశగా నడిపిస్తుండగా, యువత, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.

More Telugu News