kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు పైపులైన్‌ నిర్మాణం.. రూ.25 వేల కోట్ల వ్యయం?

  • మూడో టీఎంసీ నీటి కోసం అధికారుల ప్రతిపాదన
  • ప్రభుత్వం వద్దకు చేరిన ప్రతిపాదనలు
  • పరిపాలన అనుమతి వచ్చాక పనులు

తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం మరో 25 వేల కోట్ల రూపాయలు పెరగనుంది. మూడో టీఎంసీ నీటి కోసం పైపులైను నిర్మాణం చేపట్టాలని తాజాగా ప్రతిపాదించారు. ఇందుకోసం 25 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పాలనాపరమైన అనుమతి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండడంతో అధికారులు ఎదురుచూస్తున్నారు.

 సాధారణంగా కొండను తవ్వి టన్నెల్‌ నిర్మాణానికి కిలోమీటరుకు రూ.120 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పైపులైను ఏర్పాటుతో వ్యయం రెట్టింపు అవుతుంది. టన్నెల్‌ మన్నిక వందేళ్లు ఉంటుందని, పైపులైన్‌ అయితే 30 నుంచి 40 ఏళ్లే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ, విద్యుత్‌ వ్యయం, నిర్వహణ భారం కూడా అధికంగానే ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More Telugu News