Cricket: చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఈజీ టార్గెట్

  • ధోనీ సేన లక్ష్యం 150 రన్స్
  • నిర్ణాయక మ్యాచ్ లో ముంబయి బ్యాటింగ్ వైఫల్యం
  • ఫర్వాలేదనిపించిన పొలార్డ్

ఐపీఎల్-12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో చచ్చీచెడీ 149 పరుగులు చేసింది. ఈ క్రమంలో 8 వికెట్లు కోల్పోయింది. దిగ్గజాలతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది చాలా స్వల్ప లక్ష్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరంభంలో డికాక్ మెరుపులు మెరిపించినా అది కాసేపే అయింది. ముంబయి జట్టులో పొలార్డ్ తప్ప ఎవరూ నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు. పొలార్డ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు చేసి వెనుదిరగడం ఆ జట్టు భారీ స్కోరు అవకాశాలను దెబ్బతీసింది. చెన్నై పేసర్లు దీపక్ చహర్ 3, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లతో ముంబయి పనిబట్టారు. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా తనవంతుగా 2 వికెట్లు తీసి ముంబయిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

More Telugu News