Devender Fadnavis: పెళ్లి కావట్లేదనే వేదన.. తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాననే బాధ.. కారుణ్య మరణం కోసం వ్యక్తి దరఖాస్తు

  • తల్లికి 70, తండ్రికి 83 ఏళ్లు
  • తల్లిదండ్రులంటే చాలా ఇష్టం
  • ఉన్నత విద్యావంతుడు, సంపన్న కుటుంబం

పెళ్లి కావడం లేదనే మనోవేదన ఓవైపు, తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నానన్న బాధ మరోవైపు ఉండటంతో మహారాష్ట్రలో ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కుకు లేఖ రాశాడు. ఈ లేఖ విషయమై పోలీస్ అధికారి దేవీదాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఇరవై రోజుల క్రితం ఈ లేఖ సీఎం కార్యాలయానికి చేరింది.

35 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాననే వేదనలో రాశాడు. తన తల్లికి 70 ఏళ్లని, తండ్రికి 83 ఏళ్లని ఆ వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. తనకు తల్లిదండ్రులంటే చాలా ఇష్టమని, పెళ్లి కాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఆ లేఖ రాసిన వ్యక్తి ఉన్నత విద్యావంతుడే కాకుండా, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని దేవీదాస్ పేర్కొన్నారు. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు.

More Telugu News