Gambhir: గంభీర్ కు నోటీసులు పంపిన కేజ్రీవాల్... క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

  • ఢిల్లీ నార్త్ స్థానంలో అమీతుమీ
  • ఆప్ అభ్యర్థి అతిషి, బీజేపీ క్యాండిడేట్ గంభీర్ మధ్య వివాదాలు
  • కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన గంభీర్

ఆమ్ ఆద్మీ పార్టీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మధ్య సాగుతున్న పోరాటం తీవ్రరూపు దాల్చింది. ఢిల్లీ నార్త్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గంభీర్ కు, అదే స్థానంలో బరిలో ఉన్న ఆప్ అభ్యర్థి అతిషి మార్లేనాతో వివాదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో గంభీర్ తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం పట్ల ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు.

'అరవింద్ కేజ్రీవాల్ లాంటి సీఎం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, మీ మెదడుకు పట్టిన మురికిని తొలగించడానికి చీపురును వేరొకరికి ఇవ్వండి' అంటూ గంభీర్ ట్వీట్ చేయగా, కేజ్రీవాల్ మండిపడ్డారు. అంతేకాదు, గంభీర్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెబుతున్నట్టుగా 24 గంటల్లో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాలంటూ స్పష్టం చేశారు.

More Telugu News