Rajiv Gandhi: ఏ ప్రధాని గురించీ నేను అమర్యాదకరంగా మాట్లాడలేదు!: రాజ్ నాథ్ సింగ్

  • రాజీవ్ పై ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్ నాథ్ కామెంట్ 
  • రాష్ట్రపతి, ప్రధాని అంటే వ్యక్తులు కాదు.. వ్యవస్థలు
  • ఏ పార్టీ అయినా దేశం కోసం ఎంతో కొంత చేస్తుంది

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి 'నంబర్ వన్ అవినీతిపరుడు' అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. మన మధ్యలో లేని వ్యక్తిని రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవడం దారుణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రధానిని ఉధ్దేశించి తాను ఎప్పుడూ అభ్యంతరకరంగా మాట్లాడలేదని అన్నారు. దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి అంటే వ్యక్తులు కాదని... వారు ఒక వ్యవస్థతో సమానమని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానిల స్థాయులు బలంగా ఉండేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెండు వ్యవస్థలు బలహీనమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని... ప్రజాస్వామ్యం బలహీనపడితే దేశ విభజన నుంచి ప్రపంచంలోని ఏ శక్తి మనలను రక్షించలేదని అన్నారు.

ఏ పార్టీ అయినా దేశానికి ఏమీ చేయలేదని తాను ఎన్నడూ చెప్పనని... ప్రతి పార్టీ దేశం కోసం తన వంతు ఎంతో కొంత చేస్తుందని రాజ్ నాథ్ చెప్పారు. కాకపోతే పని చేసే విధానాల్లోనే తేడా ఉంటుందని అన్నారు.

More Telugu News