harbhajan singh: ఐపీఎల్ లో మరో ఘనతను అందుకున్న హర్భజన్ సింగ్

  • 150 వికెట్ల క్లబ్ లో చేరిన భజ్జీ
  • 169 వికెట్లతో అగ్ర స్థానంలో మలింగ
  • ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో భజ్జీ ఈ రికార్డును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో 150 వికెట్లు సాధించిన నాలుగో బౌలర్ గా అవతరించాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్లలో శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ (169) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా (157), పియూష్ చావ్లా (150) ఉన్నారు.

More Telugu News