venejuela: వెనెజువెలాపై ఆంక్షలు విధించిన అమెరికా

  • రక్షణ, భద్రత రంగాలపై ఆంక్షలు
  • చమురు రంగంలో కీలకమైన రెండు కంపెనీలపై కూడా ఆంక్షలు
  • వెనెజువెలాలో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ పోరు

వెనెజువెలా రక్షణ, భద్రత శాఖలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. వీటికి సహకరిస్తున్న వ్యక్తులపై కూడా ఆంక్షలు ఉంటాయని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతేకాదు, వెనెజువెలా ఎకానమీకి సంబంధించిన చమురు రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు షిప్పింగ్ కంపెనీలపై కూడా ఆంక్షలు విధించింది. వెనెజువెలా నుంచి క్యూబాకు చమురును తరలిస్తున్న రెండు కంటెయినర్లను తాము గుర్తించామని... ఇదంతా బ్లాక్ ప్రాపర్టీగా గుర్తిస్తున్నామని చెప్పింది.

వెనెజువెలాలో ప్రస్తుతం అంతర్గత రాజకీయ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య పోరు జరుగుతోంది. ప్రతిపక్ష నేత జువాన్ కు అమెరికా మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో జువాన్ తనకు తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అతనికి అమెరికాతో పాటు యూకే, జపాన్, ఫ్రాన్స్ తదితర 50 దేశాలు అండగా ఉన్నాయి. అయితే, సైన్యం అండతో అధ్యక్షుడు మదురో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయనకు రష్యాలాంటి దేశాలు అండగా ఉన్నాయి.

More Telugu News