Kova Lakshmi: జడ్పీటీసీగా ఆమె ఎన్నికను రద్దు చేయండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం: బీజేపీ అభ్యర్థి డిమాండ్

  • జడ్పీటీసీగా కోవా లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం
  • తమను కిడ్నాప్ చేశారన్న శేకు
  • తన భర్తను చంపేస్తామని బెదిరించారన్న చంద్రకళ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే తనను, తన భార్యను కిడ్నాప్ చేసి బంధించారని, చంపుతామని బెదిరించారని బీజేపీ అభ్యర్థి మైసన్ శేకు ఆరోపించారు. కోవా లక్ష్మి ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జైనూర్ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే లక్ష్మి కుట్రకు పాల్పడ్డారని, తనతో పాటు తన భార్య చంద్రకళను కిడ్నాప్ చేసి వేర్వేరు చోట్ల బంధించారని మైసన్ శేకు ఆరోపించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే తన భర్తను చంపుతామని బెదిరించారని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని శేకు, చంద్రకళ హెచ్చరించారు.

More Telugu News