RTI: ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై విజయసాయిరెడ్డి అభ్యంతరం

  • సీఎస్ కు విజయసాయిరెడ్డి లేఖ
  • టీడీపీ యాక్టివిస్టులను ఈ పదవుల్లో నియమించారు
  • ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలి

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎస్ కు ఓ లేఖ రాశారు. విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను, ఏపీ విద్యా శాఖ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న శ్రీరాంమూర్తిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమించడంపై అభ్యంతరం తెలుపుతున్నామని అన్నారు.

 శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ యాక్టివిస్టులని, ఇలాంటి వాళ్లను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం ఈ నియామకాలు చేపట్టాలని ఆ లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. 2017లో ఆరుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడంతో, ఆ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండటంతో ఆ నియామకాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

More Telugu News