vishal: 'అయోగ్య' సినిమా విడుదల వాయిదా

  • విశాల్ హీరోగా 'అయోగ్య' 
  • తెలుగు 'టెంపర్'కి రీమేక్
  •  కీలకమైన పాత్రలో పార్తీబన్

 తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' చిత్రానికి రీమేక్ గా, తమిళంలో 'అయోగ్య' నిర్మితమైంది. విశాల్ కథానాయకుడిగా నటించగా, ఆయన సరసన రాశి ఖన్నా నటించింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ రోజున తమిళనాట విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ తేదీతో పోస్టర్స్ ను వదిలారు .. ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ ఎందుకనో చివరి నిమిషంలో ఈ  సినిమా థియేటర్లకు రాలేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో పార్తీబన్ కీలకమైన పాత్రను పోషించడం విశేషం. పూర్తి మాస్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే బలమైన నమ్మకంతో విశాల్ వున్నాడు. 

More Telugu News