Supreme Court: అయోధ్య భూ వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా

  • మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తికి మరింత సమయం కావాలి
  • కమిటీ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
  • ఆగస్టు 15 వరకు సమయమిచ్చిన ధర్మాసనం

అయోధ్య భూ వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.దీనిపై సుప్రీం కోర్టులోఈరోజు విచారణ జరిగింది. మధ్య వర్తుల కమిటీ సమర్పించిన నివేదికపై సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరింత సమయం కావాలని కమిటీ కోరింది.

ఈ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వివాదంపై నివేదిక సమర్పించేందుకు ఆగస్టు 15 వరకు సమయమిచ్చింది. సదరు కమిటీ ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయాలు, ఇతర అంశాలను ప్రస్తుతం వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పత్రాల అనువాదంలో అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు పిటిషనర్లకు అనుమతినిచ్చింది.

ఈ నెల 7న కమిటీ మధ్యంతర నివేదిక అందిందని, 13,500 పేజీల నివేదికను అనువదించేందుకు కమిటీ కొంత సమయం కోరిందని సీజేఐ గొగోయ్ పేర్కొన్నారు. అయోధ్య భూవివాదం కేసు పరిష్కారంపై కమిటీ ఆశావహ దృక్పథంతో ఉందని, ఆగస్టు 15 కల్లా ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.

More Telugu News