Hyderabad: ప్రపంచంలోని అత్యుత్తమ మొదటి పది విమానాశ్రయాల్లో శంషాబాద్‌ కు స్థానం

  • ఎయిర్‌ హెల్ఫ్‌ సంస్థ విడుదల చేసిన జాబితాలో 8వ స్థానం
  • ఖతర్‌లోని హమద్‌ ఎయిర్‌ పోర్టుకు తొలి స్థానం
  • జపాన్‌లోని టోక్యో విమానాశ్రయానికి రెండో స్థానం

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రంచంలోని అగ్రస్థాయి ఎయిర్‌ పోర్టుల్లో ఒకటిగా నిలిచింది. సౌకర్యాలు, సేవలు, సమయపాలన, ఆహారం, షాపింగ్‌ తదితర అంశాల ప్రాతిపదికన ఎయిర్‌ హెల్ఫ్‌ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలపై సర్వే నిర్వహించి 2019వ సంవత్సరానికి ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో శంషాబాద్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందుకోసం ఈ సంస్థ 40 దేశాల్లోని 40 వేల మంది ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.

 ఈ సంస్థ ర్యాంకింగ్స్‌ జాబితాలో ఖతార్‌లోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానం దక్కించుకుంది. జపాన్‌లోని టోక్యో, గ్రీస్‌లోని ఎథెన్స్‌ విమానాశ్రయాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో అఫోన్సో (బ్రెజిల్‌), గాన్స్‌ లెచ్‌ వలేసా (పోలాండ్‌), షెమెటేవో (రష్యా), షాంఘి (సింగపూర్‌), రాజీవ్‌గాంధీ విమానాశ్రయం (శంషాబాద్‌), టెనెరిఫె (స్పెయిన్‌), విరాకోపస్‌/కాంపినస్‌ (బ్రెజిల్‌) నిలిచాయి.  2015 నుంచి ఎయిర్‌ హెల్ఫ్‌ సంస్థ ఈ జాబితా రూపొందిస్తుండగా, అప్పటి నుంచీ క్రమం తప్పకుండా మొదటి మూడు స్థానాల్లో హమద్‌, టోక్యో, ఎథెన్స్‌ విమానాశ్రయాలు నిలవడం విశేషం.

More Telugu News