ayodhya: అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

  • వాదనలు విననున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
  • నాలుగు రోజుల క్రితం నివేదిక సమర్పించిన మధ్యవర్తిత్వ ప్యానెల్
  • ఈ నివేదికను కూడా సమీక్షించనున్న ధర్మాసనం

అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసు వాదనలను ఈరోజు సుప్రీంకోర్టు విననుంది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వాదనలను వినబోతోంది. చీఫ్ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్ లు సభ్యులుగా వున్నారు.

మరోవైపు, ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ ప్యానెల్ లో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఖలీవుల్లా, లాయర్ శ్రీరామ్ పంచు ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ ప్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈరోజు ఈ నివేదికను కూడా సుప్రీం ధర్మాసనం సమీక్షించనుంది.

More Telugu News