TTD: తిరుమల వెంకటేశ్వరస్వామి వద్ద ఉన్న బంగారం 9,259 కేజీలు!

  • అత్యధికంగా ఎస్బీఐలో 5.3 టన్నులు డిపాజిట్
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో టన్నుకు పైగా నిల్వలు
  • ఆలయ వర్గాల సమాచారం!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి ధనవైభోగం ప్రపంచంలోని ఏ అపర కుబేరుడికి తీసిపోని విధంగా ఉంటుంది. శేషాచల కొండలపై వెలసిన ఈ కలియుగ ప్రత్యక్షదైవం వద్ద ఇప్పటివరకు ఉన్న బంగారం నిల్వలు చూస్తే అది నిజమే అనిపించకమానదు. ఓ చిన్న దేశం వద్ద ఉండే బంగారు నిల్వలకు దీటుగా తిరుమల వెంకన్న వద్ద బంగారం పోగుపడింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం స్వామివారి వద్ద 9,259 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపడం తెలిసిందే.

TTD

More Telugu News