T-congress: ‘కాంగ్రెస్’లో కోవర్టులు ఉన్నారని ఎప్పటి నుంచో చెబుతున్నా: వీహెచ్

  • కోవర్టులను ఉత్తమ్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
  • ఆ విషయం నాకు అర్థం కావట్లేదు
  • తగిన సమయంలో వారి పేర్లు బయటపెడతానన్న వీహెచ్  

ముక్కు సూటిగా మాట్లాడే టీ- కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు అదే తీరులో మాట్లాడారు. కాంగ్రెస్ ఫార్టీలో కోవర్టులు ఉన్నారని ఎప్పటి నుంచో చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ కోవర్టుల పేర్లు బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలు టీ-కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.

More Telugu News