rajasekhar: ఉత్కంఠను రేపుతోన్న 'కల్కి' ట్రైలర్

  • ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
  • పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
  •  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ 'కల్కి' సినిమా చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన నాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత అలరించనున్నారు. తాజాగా నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్లో ఐటమ్ బిట్ మెరిసేలా చేశారు. ఫొటోగ్రఫీకి .. రీ రికార్డింగ్ కి మంచి మార్కులు పడేలా అనిపిస్తోంది. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు ఆయనకి మంచి విజయాలను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలోనూ ఆయన పోలీస్ ఆఫీసరే కావడం వలన, సెంటిమెట్ కలిసొస్తుందేమో చూడాలి

More Telugu News