giriraj singh: జైలుకు వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలా? అని రాహుల్, చంద్రబాబు చర్చించుకున్నారు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఎద్దేవా

  • ఉగ్రవాదులను పోషించడం పాక్ మానుకోవాలి
  • ఎయిర్ స్ట్రయిక్స్, వాటర్ స్ట్రయిక్స్ తో సరిపెట్టుకోం
  • ప్రపంచపటంలో పాక్ లేకుండా చేస్తాం

ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ పాకిస్థాన్ కు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హితవు పలికారు. ఇప్పటిమాదిరే ఇకపై కూడా ఉగ్రవాదులకు అండగా ఉంటే... పాకిస్థాన్ మిగలదని, ప్రపంచపటంలో పాక్ ను గుర్తించడం కూడా కష్టమవుతుందని హెచ్చరించారు. ఎయిర్ స్ట్రయిక్స్, వాటర్ స్ట్రయిక్స్ తో మాత్రమే సరిపెట్టుకోబోమని... ప్రపంచపటంలో పాకిస్థాన్ లేకుండా చేస్తామని అన్నారు.

నిరాశ, నిస్పృహలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారని... ఇవన్నీ మోదీని మరింత బలవంతుడ్ని చేస్తాయని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుల సమావేశంపై స్పందిస్తూ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించేందుకు వారు భేటీ కాలేదని... జైలుకు పోకుండా ఎలా తప్పించుకోవాలా అని చర్చించుకునేందుకు సమావేశమయ్యారని ఎద్దేవా చేశారు. 

More Telugu News