avengers end game: నా టైటానిక్ ను మీ అవెంజర్స్ ముంచేసింది!: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్

  • ఇప్పటికే రూ.15,000 కోట్లు కొల్లగొట్టిన ఎండ్ గేమ్
  • టైటానిక్ కలెక్షన్ల రికార్డులు బద్దలు 
  • ట్విట్టర్ లో స్పందించిన హాలీవుడ్ దర్శకుడు

మార్వెల్ సంస్థ నిర్మించిన ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.15,302 కోట్లను దాటేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో టైటానిక్ సినిమా కలెక్షన్లను కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది. ఈ నేపథ్యంలో అవతార్, టైటానిక్ సినిమాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’పై ప్రశంసల వర్షం కురిపించారు.

మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫిజ్, ఇతర సిబ్బందిని ఉద్దేశించి..‘నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్టోర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సిబ్బంది మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు సరికొత్త ఎత్తుకు చేరుకుందని మీరు నిరూపించారు’ అని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా అవెంజర్స్ లోగోను ఢీకొట్టిన టైటానిక్ మునిగిపోతున్నట్లు డిజైన్ చేసిన ఓ ఫొటోను జేమ్స్ కామెరూన్ ట్వీట్ కు జతచేశారు. అవెంజర్స్ సిరీస్ లో చివరిది కావడంతో ఈ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తోంది. 1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఏకంగా రూ.15,000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

More Telugu News