Nitya Menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజ్ తరుణ్ తో నిత్యా మీనన్ 
  • మళ్లీ కామెడీ చిత్రంలో మహేశ్ 
  • ఆగస్టు నుంచి వరుణ్ కొత్త చిత్రం  

 *  యంగ్ హీరో రాజ్ తరుణ్ తన తదుపరి చిత్రాన్ని నిత్యా మీనన్ తో చేయనున్నాడు. తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయితో హీరో లవ్ లో పడే కథతో ఈ చిత్రం రూపొందుతుంది. దీనికి విజయకుమార్ కొండా దర్శకత్వం వహిస్తాడు.
*  తాజాగా 'మహర్షి' చిత్రంలో నటించిన మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పూర్తి కామెడీతో సాగే కథతో చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది. దూకుడు తర్వాత మళ్లీ అంతటి కామెడీ ఆ చిత్రంలో ఉంటుందని మహేశ్ చెప్పాడు.
*  ప్రస్తుతం 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్న వరుణ్ తేజ్ దీని తర్వాత అల్లు వెంకటేశ్ నిర్మించే చిత్రంలో నటిస్తాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా నటిస్తాడు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ కి వెళుతుంది. 

More Telugu News