Tollywood: అందరూ భయపడేది దేవుడికి కాదు ‘లా అండ్ ఆర్డర్' కే!: సినీ నటుడు నాగబాబు

  • మతమే లేకపోతే మతపెద్దలు అనే వారే ఉండరు
  • ఈ భూమి మీద మతాలు లేకుండా పోవాలి
  • ఎవడికీ ‘దేవుడు’ అంటే భయం లేదు

అసలు మతమే లేకపోతే మతపెద్దలు అనే వారే ఉండరని ప్రముఖ సినీనటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’ లో ఆయన మాట్లాడుతూ, కొన్ని వందల సంవత్సరాలకైనా ఈ భూమి మీద మతాలు లేకుండా పోతే, చాలా సుఖమైన ప్లేస్ ఈ భూమి అవుతుందని అన్నారు.

 ‘ ‘దేవుడు’ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎవరూ దేనికీ భయపడకుండా, విచ్చలవిడి తనం పెరిగిపోతుందేమో? అన్న ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ, ‘దేవుడికి ఎవరూ భయపడరు. ప్రతివాడు ఎదుటివాడిని కొట్టి, హింసించి, చంపి.. వాడు తప్పు చేశాడు తగిన శిక్ష విధించాను. ఆ దేవుడు చెప్పాడు నేను చేశాను అనే కాన్సెప్టే తప్ప, ఎవడికీ ‘దేవుడు’ అంటే భయం లేదు. మనిషి భయపడేది లా అండ్ ఆర్డర్ కే’ అని అన్నారు. 

More Telugu News