modi: మోదీ నయా ఔరంగజేబ్.. వారణాసిలో వందలాది దేవాలయాలను కూల్చేశాడు: సంజయ్ నిరుపమ్

  • కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం దేవాలయాలను కూల్చేశారు
  • విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించేవారి నుంచి రూ. 550 వసూలు చేయాలని మోదీ చెప్పారు
  • ఔరంగజేబ్ చేయలేని పనులను కూడా మోదీ చేస్తున్నారు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక ఆధునిక ఔరంగజేబ్ అని అన్నారు. వారణాసిలో ఒక కారిడార్ ను నిర్మించేందుకు... ఆయన ఆదేశాలతో వందలాది దేవాలయాలను కూల్చేశారని మండిపడ్డారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను నిర్మించేందుకు నగరంలోని ఎన్నో చిన్నచిన్న దేవాలయాలను, బిల్డింగులను కూల్చేశారని అన్నారు. బాబా విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించే వారి నుంచి రూ. 550 వసూలు చేయాలని మోదీ చెప్పారని... ఇది ఫీజు కావచ్చు లేదా ఫైన్ కావచ్చని దుయ్యబట్టారు.

ఆనాడు ఔరంగజేబ్ చేయలేకపోయిన పనులను ఇప్పుడు మోదీ చేస్తున్నారని నిరుపమ్ విమర్శించారు. ఒకసారి కాశీ వీధుల్లోకి ఔరంగజేబ్ వచ్చారని, మన దేవాలయాలను కూల్చేసేందుకు యత్నించారని... కానీ, స్థానికులు అడ్డుపడి దేవాలయాలను రక్షించుకున్నారని చెప్పారు. అలాంటి నిరసనే ఇప్పుడు కూడా వారణాసి వీధుల్లో చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.

More Telugu News