Andhra Pradesh: ఏపీ సీఎస్ కు మంత్రి వర్గ సమావేశ అజెండా పంపిన సీఎంఓ!

  • పలు అంశాలపై చర్చిస్తామన్న సీఎంఓ
  • దీన్ని ఆయా శాఖల కార్యదర్శులకు పంపనున్న సీఎస్ 
  • ఆపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలన

ఈ నెల 10న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం నోట్ పంపిన విషయం తెలిసిందే.ఈ భేటీలో ఏ అంశాలపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని సీఎస్ కోరడంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. మంత్రి వర్గ సమావేశ అజెండాను సీఎస్ కు పంపింది. ‘ఫణి’ తుపాన్, రాష్ట్రంలో కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపుల్లో అడ్డంకులపై చర్చిస్తామని తెలిపింది.

సీఎంఓ పంపిన అంశాలను ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ పంపనున్నారు. ఆయా శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత, ఆయా అంశాలపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించాక ఆ అజెండాను ఈసీకి పంపుతారని సమాచారం. ఇదిలా ఉండగా, ముందస్తు అనుమతి కోసం ఈసీకి సమాచారం పంపాల్సి ఉండటంతో ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడినట్టు సమాచారం. ఈ నెల 14న మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News