sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా ఐదో రోజు పతనం

  • అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం
  • 323 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 100 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి కుప్పకూలాయి. వరుసగా ఐదో రోజు బేర్ మన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీనికి తోడు రియాల్టీ, ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో వృద్ధి రేటు తగ్గడం, పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరాశను కలిగించడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు పతనమై 38,276కు పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 11,497కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.37%), ఎల్ అండ్ టీ (1.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.84%), ఇన్ఫోసిస్ (0.79%), ఓఎన్జీసీ (0.73%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-4.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.77%), భారతి ఎయిర్ టెల్ (-3.10%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.91%), వేదాంత (-2.07%).          

More Telugu News