Nirmala Sitharaman: మమతా బెనర్జీపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు

  • మమత వర్గీయులే హింసను ప్రేరేపించారు
  • ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
  • ఇలాగైతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేరు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మమత వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ఓవైపు ప్రజాస్వామ్యం క్షీణిస్తోందంటూ గావుకేకలు పెడుతూ, మరోవైపు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ ఓటర్లకు దన్నుగా కేంద్ర బలగాలు వస్తే, మమత వర్గీయులు మాత్రం అన్ని ప్రాంతాల్లో కలియదిరుగుతూ హింసను ప్రేరేపించారని ఆరోపించారు. పోలింగ్ రోజు హింసాకాండ తృణమూల్ నిర్వాకమేనని మంత్రి మండిపడ్డారు. ఈ విధమైన హింసతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పరిస్థితి ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News