jarkhand: మోదీ.. పేదలకు కాదు అనిల్ అంబానీకి చౌకీదార్: రాహుల్ గాంధీ

  • ఆదివాసీల కోసం మోదీ చేసిందేమీ లేదు
  • మేము అధికారంలోకి వస్తే ‘న్యాయ్’ పథకం తీసుకొస్తాం
  • ఆదివాసీలు, పేదల జీవితాల్లో మార్పు తెస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ పేదల చౌకీదార్ కాదని, అనిల్ అంబానీకి చౌకీదార్ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఐదేళ్లలో ఆదివాసీల కోసం మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ‘న్యాయ్’ పథకంతో ఆదివాసీలు, పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అన్ని వర్గాలను మోదీ మోసం చేశారని, లక్షల కోట్ల రూపాయల డబ్బును పేదలు, రైతులు, ఆదివాసీల నుంచి మోదీ తీసుకున్నారని, ఆ డబ్బును అనిల్  అంబానీ, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, విజయ్ మాల్యాకు ఇచ్చారని ఆరోపించారు. ఆదివాసీల భూములు, అడవులను అంబానీకి మోదీ ఇచ్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలకు ఇష్టం లేకుండా వారి భూములను ఏ ప్రభుత్వం కూడా సేకరించకూడదన్న చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. గడచిన ఐదేళ్లలో రైతులకు, ఆదివాసీలకు, యువతకు మోదీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.

More Telugu News