Andhra Pradesh: ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ ఉంటుంది: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • అధికారులతో సీఎస్ సమాలోచన
  • కేబినెట్ అజెండాను స్క్రీనింగ్ చేసి ఈసీకి పంపుతాం
  • అజెండా పరిశీలనకు కనీసం 48 గంటల సమయం పడుతుంది

 ఈ నెల 10న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం నోట్ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తో ఆయన సమాలోచన చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేబినెట్ నిర్వహణపై అధికారులతో ఆయన చర్చించినట్టు సమాచారం. 

కేబినెట్ భేటీలో ఏ అంశాలపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని కోరానని, ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాలని సూచించినట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కేబినెట్ అజెండాను స్క్రీనింగ్ చేసి ఈసీకి పంపుతామని, ఈ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. కేబినెట్ అజెండా పరిశీలనకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పారు.

More Telugu News